కోడిపాక లో దాన్యం కొనుగోలు ప్రారంభం.

రాయల్ పోస్ట్ ప్రతినిధి హత్నూర
కొడిపాక లో ఆదివారం రోజున గ్రామ సర్పంచ్ మాధవి బాబు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా జెడ్ పి టి సి ఆంజనేయులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని చివరికి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేయకుండా మొండివైఖరి వహిస్తుందని సూచించారు. రైతుల విలువలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దని కొనుగోలు సెంటర్ ను ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రామ్ రెడ్డి, నారాయణ రెడ్డి, మక్బూల్, ఐకెపి సిసి సావిత్రి, ఐకెపి చంద్రశేఖర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు మంగమ్మ, టిఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.