మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుజరంపేట్ గ్రామంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం

రాయల్ పోస్ట్ ప్రతినిధి: ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి నాగరాజు గారు మరియు మెదక్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం కార్యదర్శి శ్రీనివాసరావు గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముజిఫాద్ధిన్.
గ్రామ సర్పంచ్ వనజ శ్యామ్ సుందర్ గారు గ్రామ ఎంపీటీసీ సభ్యులు నాయి కోటిలింగం మరియు కూకట్లపల్లి సర్పంచ్ కాంత రావు గారు పాల్గొన్నారు. జిల్లా క్రీడా అధికారి నాగరాజు మాట్లాడుతూ భారతదేశం హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షులు మరి తెలంగాణ హ్యాండ్ బాల్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ రావు గారు మరియు తెలంగాణ రాష్ట్రం హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి పవన్ కుమార్ గారూ తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ మరియు అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించి తెలంగాణలోని ప్రతి జిల్లా జిల్లాలోని ప్రతి మండలంలో లో హ్యాండ్ బాల్ ఆట అభివృద్ధి పరచడoలో ఎంతగానో కృషి చేస్తున్నారని .హ్యాండ్ బాల్ శిక్షణ శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరాడు .