మునుకుంట్ల గ్రామంలో ఘనంగా మేడే దినోత్సవం..

కట్టంగూర్ మండల్ రాయల్ పోస్ట్ ప్రతినిధి యాదగిరి.

కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో ఘనంగా మేడే దినోత్సవం జరుపుకోవడం జరిగింది. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలతో మేస్త్రీలు ఇతర కార్మికులు అందరూ కలిసి మేడే జరుపుకున్నారు. ఇందులో మునుకుంట్ల మేస్త్రీల సంఘం అధ్యక్షుడు,దొడ్డి నరసింహ. ఉపాధ్యక్షుడు తెలగమల్ల రాంబాబు, మాట్లాడుతూ ప్రతి ఒక్క పనిచేసే కార్మికుల లేబర్ కార్డు కచ్చితంగా ఉండాలి అని లేబర్ కార్డు ఉండడం ద్వారా ఉండే ప్రయోజనాలు. ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికి ఏమైనా జరిగినా. ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మేడే సందర్భంగా అందరికీ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్మికునికి ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను నాకు చేతనైనంత వరకు ప్రతి కార్మికునికి ప్రభుత్వ పథకాల లేబర్ కార్డు గురించి తెలియజేస్తాం అని ఈ సందర్భంగా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. గల్లీ నరేష్,నల్ల లింగయ్య, అల్లి రామలింగయ్య, పందిరి బాబు, తెలగమల్ల రమేష్, బండ్ల గణేష్, గంటెకంపు యాదయ్య. తదితరులు పాల్గొన్నారు.