పీడీఎస్ బియ్యం పట్టివేత
ఆలేరు మే 1, రాయల్ పోస్ట్ ప్రతినిధి అంబిక….
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ ఐ ఇద్రిస్ ఆలీ తెలిపిన
వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణంలో ఉదయంపెట్రోలింగ్ చేస్తుండగా అశోక్ లేలాండ్ లో అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తి మూడవ గణేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు