టిఆర్ఎస్కెవి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ప్రభాకర్ గారికి శ్రమశక్తి అవార్డు

రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మేడే సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక సేవలను గుర్తించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రమశక్తి అవార్డుల ప్రదానం లో భాగంగా నేడు రవీంద్రభారతిలో జరిగిన మే డే ఉత్సవాల కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రులు మల్లారెడ్డి గారు, డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ గారు చేతుల మీదుగా నేడు టిఆర్ఎస్కెవి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రభాకర్ అవార్డు అందుకోవడం జరిగింది. తమను గుర్తించి శ్రమశక్తి అవార్డు అందజేసిన మంత్రులు మల్లా రెడ్డి గారికి,ఈ అవార్డుకు సహకరించిన మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి,రాంబాబు యాదవ్ గారికి ప్రభాకర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మిక వర్గానికి అహర్నిశలు సేవలందిస్తున్న కారణంగా తను గుర్తించి అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ప్రభాకర్ గారు తెలిపారు.