చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి.
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,01/05/2022

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 8 న హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే నిరసన దీక్షకు మాదిగ, మాదిగ ఉప కులాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల నాగేందర్ మాదిగ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో నిరసన దీక్ష కరపత్రాలను ఆవిష్కరించిన మాట్లాడారు .ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించడంతోపాటు హెల్త్ కార్డులు అందించి హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టు కుటుంబాలకు నివాస స్థలం లను లేదా అవసరమైనచోట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందించాలన్నారు. కరోనా తో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నాయకులు ఊటుకూరి రవీందర్ ,వల్ల పట్ల రవి, వల్ద స్ ప్రవీణ్, దుర్గం వెంకటయ్య మామిడి శ్రావణ్, పాండి సిరి, కొంగల సతీష్ ,వడ్డే వెంకయ్య , దుర్గం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.