ఘనంగా మేడే దినోత్సవం
రాయల్ పోస్ట్ ప్రతినిధి మహేష్ /తుర్కపల్లి:

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా, సీపీఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో తుర్కపల్లి మండలకేంద్రంతో పాటు ఇబ్రాహింపురం, దత్తాయపల్లి గ్రామాల్లో ఎర్ర జెండాను ఆవిష్కరించి మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, సిపిఐ మండల కార్యదర్శి సిలివేరు దుర్గయ్య మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ కార్మిక,కర్షక,శ్రమజీవులకు అండగా కొనసాగుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని హితవుపలికారు.ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు గుంటిపల్లి సత్తయ్య,కోట రవీందర్,వల్లపు భగవంతు,ఈదులకంటి రమేష్, బూడిద నరసింహ గౌడ్,
సిలివేరు కాశయ్య,భూషి శ్రీను,
బొట్టు భూమయ్య, ఎస్ కె జమాల్,డొంకెన మల్లయ్య,
ఇబ్రాహింపురం హమాలి సంఘం అధ్యక్షుడు గుజ్జుక మహిపాల్,ఉపాధ్యక్షుడు నాగారం అంజయ్య,మార్క సత్యనారాయణ గౌడ్,బత్తుల కుమారస్వామి,మోత్కుపల్లి నర్సింహులు,నాగారం కృష్ణ,బత్తుల హారినాధ్,నాగారం నర్సింహులు, నర్లెంగల రమేష్,శ్రీను,బండారి రాజు,కొరిమి రాజు,అన్నం పట్ల సుధాకర్,మేకల గణేష్,రాజు,బత్తుల రాజు,వెంకటయ్య,బండారు జహంగీర్,తదితరులు పాల్గొన్నారు.