గ్రామగ్రామాన మే డే వేడుకలు
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్
ఆలేరు మే 1, రాయల్ పోస్ట్ ప్రతినిధి అంబిక….
మే డే ను పురస్కరించుకొని ఆదివారం మండలంలోని అన్ని గ్రామాలలో మే డే ను ఘనంగా నిర్వహించామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆలేరు పట్టణంలో మేడే సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆనాడు అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులంతా 18 గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు కావాలని సమ్మె చేస్తున్న సందర్భంగా కార్మికులపై విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో వందలాది మంది కార్మికులు మరణించిన దినానికి గుర్తుగా మే డే ను జరుపుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఐలి సత్తయ్య. మండల కార్యదర్శి సిహెచ్ కనకయ్య. ఆలేరు పట్టణ కార్యదర్శి గొట్టి పాముల శ్రీనివాసరాజు. సిహెచ్ పరశురాము. దూడ లింగం. పల్లె శీను. ప్రేరణ పురాణములు. సంధ్య. సరళ. కళ్యాణి. ఎండి ఆలీ మా బేగం. లక్ష్మి. జాంగిర్ తదితరులు ఉన్నారు