గుర్తు తెలియని వికలాంగ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్
పటాన్చెరువు ప్రతినిధి.రాయల్ పోస్ట్ న్యూస్.

*లింగంపల్లి బస్టాప్ సమీపంలో మురుగు కాలువ పై దాదాపు 40 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడు. మరణించిన వ్యక్తి గురుంచి ఎటువంటి సమాచారం అందక పోవడంతో పోలీసులు యం.డి.ఆర్ ఫౌండేషన్ వారికి సమాచారాన్ని అందజేశారు. ఈ మృత దేహానికి అంత్యక్రియలు చేయాలని కోరగా యం.డి.ఆర్ ఫౌండేషన్ స్పందించి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.