కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీఆర్ అంబేడ్కర్” – జాకట శ్రీనివాస్

రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జాకట శ్రీనివాస్ మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా మేడ్చల్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జాకట శ్రీనివాస్ మాట్లాడుతూ మనం అంబేద్కర్ని మర్చిపోతే కార్మిక చట్టాలను మరిచిపోయినట్టు.
ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని,స్త్రీలకు ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు, అంబేద్కర్ చూపిన చొరవ ఫలితాలను కార్మిక వర్గం నేటికీ పొందుతోంది. వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో 1942 జులై నుంచి 1946 జూన్ వరకు అంబేడ్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టారు. అంబేడ్కర్ కృషితో వచ్చిన నిబంధనలు, మారిన/తెచ్చిన చట్టాలు ఇవీ.

  1. పనిగంటలు ఎనిమిదికి తగ్గింపు. 2. లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం. 3. వేతన చెల్లింపు చట్టం. 4. కనీస వేతనాల చట్టం. 5. ఉద్యోగుల వేతన సవరణ చట్టం. 6. భారత కర్మాగారాల చట్టం. 7. భారత కార్మిక సంఘ చట్టం. 8. కార్మికుల పరిహార చట్టం. 9. కార్మికుల రక్షణ చట్టం. 10 ప్రసూతి ప్రయోజనాల చట్టం. 11. కార్మిక రాజ్య బీమా(ఈఎస్ఐ) చట్టం
  2. మహిళలు, బాల కార్మికుల రక్షణ చట్టం. 13. బొగ్గు గనుల కార్మికుల భవిష్య నిధి, బోనస్ చట్టం. 14. మహిళా కార్మికుల సంక్షేమ నిధి. 15. బొగ్గు గనుల్లో భూగర్భ పనుల్లో మహిళల నియామకంపై నిషేధం పునరుద్ధరణ.16. వేతనంతో కూడిన సెలవులు. 17. సామాజిక భద్రత 1923 నాటి కార్మికుల పరిహార చట్టం, ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1943 నాటి కర్మాగారాల చట్టంలలో కార్మికులకు అనుకూలంగా సవరణలు తీసుకొచ్చేందుకు వివిధ స్థాయుల్లో అంబేడ్కర్ చర్యలు చేపట్టారు. పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకించారు. బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు.కుల వ్యవస్థ పనినే కాదు, కార్మికులనూ విభజిస్తుంది. భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబేడ్కర్, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన, తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు. దళితుడైనందుకే అంబేడ్కర్‌కు అంత గుర్తింపు దక్కలేదు, కార్మికుల కోసం అనేక చట్టాలను అంబేడ్కర్ తీసుకొచ్చారని, కానీ ఆయనకు లభించాల్సినంత విస్తృతమైన గుర్తింపు లభించలేదని, ఆయన దళితుడు కావడమే దీనికి ఒక కారణమని ఎస్‌ఎన్ బూసి తెలిపారు. పనిగంటలు ఎందుకు తగ్గించారంటే…
    పనిగంటలను 12 నుంచి ఎనిమిదికి తగ్గించాలని 1942 నవంబరు 27న దిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్ తొలిసారిగా ప్రతిపాదించారు. 1945 నవంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు కర్మారాగాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సదస్సులో కేంద్ర, ప్రావిన్షియల్ ప్రభుత్వాలు, యాజమాన్య సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయుడు అంబేడ్కరే
    విధాన స్థాయిలోనే కాకుండా రాజకీయ స్థాయిలోనూ అంబేడ్కర్ కార్మిక సంక్షేమానికి కృషి చేశారు. కార్మికుల కోసమే పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే.
    1936 ఆగస్టులో అంబేడ్కర్ ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ఐఎల్‌పీ)’ని స్థాపించారు. తమది కార్మికుల పార్టీ అని ఐఎల్‌పీ ప్రకటించుకొంది. కార్మిక వర్గాల సంక్షేమమే పరమావధిగా కలిగిన కార్మిక సంస్థగా ఐఎల్‌పీ 1937లో వెలువరించిన విధానపత్రంలో తనను తాను అభివర్ణించుకొంది.1937లో జరిగిన ప్రావిన్సియల్ ఎన్నికల్లో ఐఎల్‌పీ 17 స్థానాల్లో పోటీచేసి, 14 చోట్ల విజయం సాధించింది. పోటీచేసిన 13 రిజర్వుడు స్థానాల్లో 11 చోట్ల, పోటీచేసిన నాలుగు జనరల్ సీట్లలో మూడు చోట్ల గెలిచింది.ఐఎల్‌పీ కార్మికులు, చిన్నరైతుల కోసం పెద్దయెత్తున అనేక పోరాటాలు చేసింది. రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ కూడా అంబేద్కర్ అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కొరకు పని చేస్తుందని, ఆ పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జాకట శ్రీనివాస్ తెలియజేశారు.
    ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాకట శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జాకట ప్రేమ్ దాస్, కార్యదర్శి అశోక్ మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు జె.బాబు రాజ్, ప్రదాన కర్యదర్శి నీరుడి ప్రేమ్ దాస్, గజ్వేల్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి అన్నగాల రాములు, సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబర్ జాకట రాములు, కానుకుంట నరేష్, మల్లెల వెంకటేష్, ఎన్. సంజీవ, బి. కృష్ణ, శ్రీ రాములు, రాంబాబు, బాల సాయిలు, ఏ.లక్ష్మణ్, ఎల్. సుధాకర్, జి. శ్రీనివాస్, మల్లిక్,ఎన్. సందీప్, అబ్రహం, లక్ష్మయ్య, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.