సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన యువతకు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ మరియు గ్రూప్ 1-4 ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఎస్వీ డిగ్రీ కళాశాల, సూర్యాపేట యందు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలోని గిరిజన యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శంకర్, పర్యవేక్షకులు అంజాద్, యస్.సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ సి.హెచ్ రాములు, లింగస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.