శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన రోజు మే డే సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్,సూర్యాపేట,01/05/2022

శ్రమజీవుల హక్కులకై కోసం పోరాడిన రోజు మే డే అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మభిక్షం భవన్ సిపిఐ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1831 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో 18 గంటల పనివిధానం పోయి ఎనిమిది గంటల పని కావాలని వారానికి ఒకరోజు సెలవు కావాలని బాలకార్మికులను పనిలో పెట్టవద్దని నినాదంతో వేలాదిమంది కార్మికులు తిరుగుబాటు చేసి తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్త తర్పణం చేసిన అమరవీరులకు రక్తంతో తడిసిన చొక్కానే ఎర్రజెండా అవతరించి కార్మికుల జెండాగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు అండ ఈ జెండా అన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అనే నినాదంతో హక్కులను సాధించుకున్న రోజు మే ఒకటో తేదీ ఇలాంటి చరిత్ర కలిగిన మన భారత దేశంలో స్వతంత్రానికి మందు నుండి అనేక కార్మికులు ఉద్యమాలు నడిపిన చరిత్ర కలిగిన సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడులుగా విభజించి కార్మికుల హక్కులను హరించవేసి కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని అన్నారు. అనంతరం ఆయన దురాజ్ పల్లి లోని హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ యూనియన్ దగ్గర, రాజీవ్ నగర్ ఆటో యూనియన్ దగ్గర, బొడ్రాయిబజార్ లోని రిక్షా యూనియన్ దగ్గర, తళ్లగడ్డ లోనే చామల అశోక్ ఇంటి ఎదురుగా ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి దోరేపల్లి శంకర్, ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, జిల్లా నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, చామల అశోక్, బూర వెంకటేశ్వర్లు, టైలరింగ్ కార్మికులు శ్రీనివాస్, ఆయిల్ ట్యాంకర్ యూనియన్ నాయకులు సట్టు జానయ్య, ఉపేందర్, నిమ్మల ప్రభాకర్, ఆర్టీసీ యూనియన్ నాయకులు సేవ్య, గాలి కృష్ణ, చారి బూర సైదులు, సురేందర్, వెంక రెడ్డి, కప్పల రాము, తదితరులు పాల్గొన్నారు.