రంజాన్ మాసం ఎదుటి వారి ఆకలిని తెలుసుకోవడానికి.మొహమ్మద్ ఖలీల్ అఖ్తర్ జర్నలిస్ట్
….. ఘట్కేసర్ మండలంలోని ఎన్ ఎఫ్ సి గ్రామం జాహ్ర్ మస్జీద్ లో ఆదివారం రోజున మహమ్మద్ జహంగీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలీల్ పాల్గొని మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్ర మాసం అని ఇంగ్లీష్ నెలలలాగే ఇస్లామిక్ నెలలు ఉంటాయి అని అందులో రంజాన్ ఒక ప్రత్యేక నెల అని తెలిపారు. రంజాన్ నెలలోనే దైవ గ్రంధం అయిన ఖురాన్ అవతరించిందని దానికి కృతజ్ఞతగా పూర్తి నెల ఉపవాసాలు ఉంటూ ఖురాన్ పఠనము చేయవలసిందిగా దైవ ఆజ్ఞ అని తెలిపారు. రంజాన్ అనగా కాలిపోవడం అని ఉపావాసం వలన పాపాలు కాలి పోతాయని మరియు శరీరంలోని వ్యాధులు నాశనం అయిపోతాయని అన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు కలిగే ఆకలి మరియు దప్పికను ఓర్చుకోవడం వలన బీద ప్రజల యొక్క ఆకలి, దాహంను తెలుసుకుని వారికి సహాయం చేయాలని తెలిపారు. రంజాన్ నెల ఒక ట్రేనింగ్ సమయం అని ఈ నెలలో ఎలాగైతే పాపాలు చేయకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ అందరికీ సహాయం చేస్తారో అదే విధంగా మిగితా 11 నెలలు తమ జీవితాలను గడపాలని ఖురాన్ చెపుతుందని అన్నారు. రంజాన్ నెలలో దనికులు తమ వద్ద ఉన్న బంగారం, వెండి, డబ్బు మొత్తం విలువ చేసి అందులో రెండున్నర శాతం బీద ప్రజలకు జకాత్ రూపంలో సహాయం చేసి అందరు పండగను ఘనంగా జరుపుకునే విధంగా తోడ్పాడుతారన్నారు. ప్రపంచం అంత సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కరోనా పూర్తిగా అంతం కావాలని అల్లాహ్ ను కోరుకున్నానని ఖలీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇఫ్తార్ విందును ఏర్పాటుచేసిన ఎండి జాంగిర్, ఘట్కేసర్ nfc తెరాస మైనారిటీ నాయకులు ఎండీ మతీన్ , ఎండీ వసీం ,ఎండీ అబ్బసలి,ఎండీ రిజ్వాన్,ఎండీ జహంగీర్,మౌలానా, ముస్లిం మత పెద్దలు, మస్జీద్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…