యాదాద్రి భువనగిరి: రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి:
మేడే స్ఫూర్తితో
కార్మికులంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి…
కోమటిరెడ్డి చంద్రారెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిలుపు……
ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మోట కొండూరు మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ వ్యవసాయ మార్కెట్ వరకు నిర్వహించి అరుణ పతాకం ఎగరవేయడం జరిగింది అనంతరం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు జెండా వద్ద నిర్వహించిన సభలో చంద్ర రెడ్డి మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం జరిగిన చికాగో పోరాటం చారిత్రాత్మక మైనదని అమెరికా దేశంలోని చికాగో నగరంలో 18 గంటల పని విధానానికి వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం ఎనిమిది గంటల పని విధానం అమలుకోసం వెట్టిచాకిరి నశించాలని 1886 సంవత్సరంలో కార్మికులంతా పెద్ద ఎత్తున పోరాటం చేశారని దానిని వ్యతిరేకించిన కంపెనీ యాజమాన్యాలు పాలకవర్గాలు కార్మికుల పై ఉక్కుపాదం మోపాలని అందులో భాగంగానే శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్మికులపై పోలీసులు గుండ్ల వర్షం కురిపించారు దాంతో అక్కడికక్కడే కొంత మంది కార్మికులు నాయకులు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి దాంతో అక్కడున్న మిగతా కార్మికులు హక్కులు సాధించేవరకు పోరాటం చేశారని అదే స్ఫూర్తితో కార్మికులంతా పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం మేడే స్ఫూర్తి నీ దెబ్బతీసే కుట్ర చేస్తుందని ఉందని అందులో భాగంగానే vishwakarma దినంగా పాటించాలని ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రకటన చేసిందని ఆర్ ఎస్ ఎస్ చేతిలో కీలుబొమ్మగా పనిచేస్తున్న ఆ ప్రకటనను అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందించారని అంటే కార్మికులకు వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది 12 గంటల పనివిధానం నూతన 4 కార్మిక కోడులు తీసుకువచ్చి వెట్టిచాకిరి చేయించేందుకు పాలకులు ప్రయత్నం చేస్తున్నారని కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పాలకులను ఎదిరించడానికి మేడే స్ఫూర్తి గా కార్మికులు కదన రంగం లోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు మండలంలోని అన్ని గ్రామాల్లో అరుణ పతాకాలను ఎగరవేయడం జరిగింది
మే డే ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్ల గాని జయ రాములు bసిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లూరు ఆంజనేయులు భోగ రమేష్ ప్రజాసంఘాల నాయకులు బందెల పోచయ్య ఆడెపు స్వామి మామిడాల కనకయ్య బొట్ల హరి కుమార్ పీహెచ్ రోమన్ కొల్లూరి నాగరాజు చీరాల ఉపేంద్ర చెరుకు అనిల్ కాళి గోపాల్ తుమ్మల మల్లేష్ మొగలి పాక నరసింహ బొట్ల తిరుమల వంగపల్లి స్వామి గంధ మల్ల నరసింహ మంగళపల్లి చంద్రకళ బోగారం వీరస్వామి లక్ష్మయ్య బందెల సిద్దయ్య వడ్డెబోయిన యాదయ్య పాల్గొన్నారు