ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలివిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పట్టణంలో వాడవాడలా రంజాన్ వేడుకలు – 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్
విద్యానగర్ లో ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,01/05/2022

పట్టణంలోని ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యానగర్ లోని రామలింగేశ్వర టాకిస్ వద్ద ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో జిల్లా కేంద్రంలోని ప్రతి వార్డులో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం హర్షణీయమని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రములో అన్ని మతాల పండుగలు సోదరభావంతో , కలిసిమెలిసి జరుపుకుంటారని, సర్మ ధర్మ భావన, సర్వ మత సమారాధన మన సంస్కృతి లోనే వుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్, సయ్యద్ సలీమ్, లతీఫ్, తౌఫిక్, రసూల్, శంసుద్దిన్, గులాం జహంగీర్, హజిబాబా, ఇస్మాయీల్, మహబూబ్ ఆలి, బాబా రెగ్జిన్ , నూకల వెంకట రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, మిర్యాల సుధాకర్, కొండపల్లి లక్ష్మారెడ్డి, బజ్జూరి శ్రీనివాస్, తెరటపల్లి సతీష్, వెంపటి శబరినాధ్, జూలకంటి నాగరాజు, డోగుపర్తి ప్రవీణ్, బెజగం ఫణి తదితరులు పాల్గొన్నారు.