కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన 4 లేబర్ కొడులను రద్దు చెయ్యాలి-సీపీఎం మండల కార్యదర్శి బుర్రు.అనిల్ కుమార్.

రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్:భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోవిందపురం గ్రామంలో వంగూరి రామలింగయ్య గారి ఆధ్వర్యంలో సీఐటీయూ జెండాను ఎగురవేయడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు.అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మానవీయ శ్రమ విలువ, చెమట విలువ, మనిషి విలువ, సంఘం విలువ, ఐక్యత విలువ, పోరాటాల విలువ, హక్కుల విలువ, త్యాగం విలువ తెలిసి శ్రమను గౌరవించే ఆదరించే ప్రతి ఒక్కరు ఎర్ర జెండాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు, నిత్యం కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ వేల మంది రక్తంలో నుంచి పుట్టుకోచిందని కార్మికులు కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మెస్ట్రీ సంఘం సభ్యులు పెరిక లింగయ్య,వంగూరి నర్సింహా,పెరిక పిచ్చయ్య,ఎరుపుల చంద్రయ్య,ఎడ్ల వెంజన్న,ఎడ్ల జోజప్ప,వంగూరి జోజప్ప,తదితరులు పాల్గొన్నారూ