DGP వీడియో కాన్ఫరెన్స్.
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,28/04/2022

జిల్లాల అధికారులు, కమీషనర్ల తో రాష్ట్ర DGP గారు ఈరోజు రాష్ట్ర స్థాయి పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. DGP గారు మాట్లాడుతూ తీవ్ర నేరాలు జరగకుండా విజువల్ పోలీసింగ్ నిర్వహించాలి, కేసులు పెండింగ్ పెట్టవద్దు, ఎప్పటికప్పుడు అంతర్జాలంలో నమోదు చేయాలి, పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ విభాగాలను సమర్థవంతంగా నిర్వర్తించాలి అని DGP గారు అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ IPS గారు, అధనపు ఎస్పీ రితిరాజ్ IPS గారు హాజరైనారు. జిల్లాలో నమోదౌతున్న పిర్యాదులు, కేసులు, కేసుల దర్యాప్తు, వర్టికల్ విభాగాలు, మహిళా భద్రత, రోడ్డు భద్రత మొదలగు అంశాలపై DGP గారికి వివరించారు. ప్రజా పిర్యాదులపై పెట్రో కార్, బ్లూ కోట్స్ సిబ్బంది పని చేస్తున్నారు అని తెలిపినారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ రోడ్డు భద్రత పై ప్రజలను చైతన్య పరుస్తూన్నాము, ప్రతి సమస్యాత్మక ప్రాంతాన్ని ప్రతిరోజూ తనిఖీ చేస్తున్నట్లు తెలిపినారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచాము, వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ నేరాల నివారణకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ గారు తెలిపినారు. కేసుల స్థితిగతులను అంతర్జాలం నందు నమోదు చేస్తున్నాము అని అన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడుతున్నారు, హెల్మెట్ దరించకపోవడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అన్నారు. తప్పక హెల్మెట్ ధరించాలి అని ఎస్పీ గారు విజ్ఞప్తి చేసినారు. రోడ్డు భద్రత జాగ్రత్తలు పాటించాలి, అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలని ఎస్పీ గారు అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అధనపు ఎస్పీ రితిరాజ్ IPS, DSP లు రఘు, మోహన్ కుమార్, CI లు విఠల్ రెడ్డి, రాజేష్, సూర్యాపేట పట్టణ CI ఆంజనేయులు, మునగాల CI ఆంజనేయులు, PND ప్రసాద్, రామలింగారెడ్డి, నర్సింహారావు, SB CI శ్రీనివాస్, ప్రవీణ్, రవి, DCRB CI నర్సింహ, IT కోర్ SI శివకుమార్, SI లు, సిబ్బంది పాల్గొన్నారు.