మే నెల 2,4 తేదీలలో
దివ్యంగుల గుర్తింపు శబిరం
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,28/04/2022
సూర్యాపేట జిల్లా మహిళ శిశు వికలాంగులు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “ఆలింకో” వారిచే మే 2వ తేదీ నాడు హుజర్నగర్ నియోజకవర్గ పరిధిలో క్యాంప్ స్థానిక హుజర్నగర్ టౌన్ హాల్ నందు 4వ తేది నాడు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ నందు దివ్యంగుల గుర్తింపు శబిరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ శిభిరానికి వచ్చే దివ్యంగులు 80% శారీరక వికలాంగులుగా అర్హత పొంది పై భాగములో గల చేతులు మంచిగా ఉండి క్రింది భాగములో గల కాళ్ళు శారీరక వికలా0గత కలిగి 16 స0వత్సరాల వయస్సు పైబడిన వారు మాత్రమే ఆర్గులని,రేషన్ కార్డ్,ఆదాయ ధృవపత్రం,ఆధార్ కార్డ్,సదరం సర్టిఫికెట్ ( 80%శారీరక వైకల్యం కలిగి ఉండాలి), మూడు పాస్ ఫోటోలుతో దివ్యంగ గుర్తింపు శిభిరానికి హాజరుకావాలి అని కాళ్ళలో తీవ్రమైన వైకల్యం ఉండి, చేతులు బాగున్నా శారీరక వికలాంగులకు బ్యాటరీ ట్ర్య్ సైకిళ్ళు , కాళ్ళు లేనివారికి అవసరమైన కుత్రిమ కాళ్ళు లేదా క్యాలిపెర్స్ కొరకు కొలతలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దివ్యంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.