మనోహరాబాద్ లో దాన్యం కొనుగోలు ప్రారంభం.
రాయల్ పోస్ట్ ప్రతినిధి మనోహరాబాద్

మండల కేంద్రమైన మనోహరాబాద్ లో గురువారం ఉమ్మడి మండలాల సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గౌడ్, లు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని చివరికి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేయకుండా మొండివైఖరి వహిస్తుందని సూచించారు. రైతుల విలువలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ దళారులకు దాన్యం విక్రయించి మోసపోవద్దని కొనుగోలు సెంటర్ ను ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు, మనోహరాబాద్ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి,ఉపాధ్యక్షులు కళ్ళకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, సొసైటీ వైస్ చైర్మన్ దీపక్ రెడ్డి, బాబుల్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు