కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
రాయల్ పోస్ట్ ప్రతినిధి :-మనోహరాబాద్
నిరుేదలకు లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల తో అవసరాలు తీరుతాయని అలాగే మైనార్టీలకు సీఎం కెసిఆర్ నేతృత్వంలో పెద్దపీట వేస్తున్నారని అరెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మనోహరాబాద్ తాసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కల మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రంజాన్ తోఫాలను జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి , ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి , ఎంపిపి పూరం నవనీత రవి ముదిరాజ్ లతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల ఆడపడుచులకు ఇంటికి పెద్ద ఆన్న లాగా రూపాయల చెక్కును మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే మైనార్టీల విద్యార్థులు విద్య బోధన కోసం 250 మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక్కో విద్యార్థి చదవడం కోసం 1.20 లక్షల ఖర్చుపెట్టి విద్యా బోధన కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో. రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, మండల మైనారిటీ అధ్యక్షులు సొసైటీ డైరెక్టర్ జావిద్ పాషా, సర్పంచులు నాగభూషణం ముదిరాజ్, నరసయ్య, మాధవ రెడ్డి, నాయకులు. వెంకట్ గౌడ్. తుమ్మల రాజు యాదవ్. మైనార్టీ సోదరులు , వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.