నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించి , పొతరం గ్రామం నుండి మనోహర బాద్ వరకు.మాజీ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి రాయల్ పోస్ట్ ప్రతినిధి : మెదక్ జిల్లా మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ , ఈరోజు తూప్రాన్ నుండి పోతరము, తుపాకుల పల్లి, పరీకి బండ, మనోహర బాద్ గ్రామాల మీదుగా మేడ్చల్ వెల్లు నూతన బస్ సర్వీస్ ను పోతరం గ్రామంలో ప్రారంభించి , పొతరం గ్రామం నుండి మనోహర బాద్ వరకు బస్సులో ప్రయాణించారు. మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతు గత 60 సంవత్సరాల నుండి బస్ సౌకర్యం లేక ఉన్నత విద్య ఆపెస్తున్నరని నా దృష్టి కి వచ్చినది అని అందుకే వెంటనే ఆర్టీసీ ఎండీ గారితో మాట్లాడి నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. మనోహర బాద్ మండలంలో నీ అన్ని గ్రామాల మీదుగా బస్ సర్వీస్ లు నడుస్తున్నయని, మండల లోనీ ప్రజలు నన్ను గెలిపించి నందుకు ఎల్లప్పుడూ అభివృద్ధికి కృషి చేస్తానని , బస్ సర్వీసులు మండలం లోని అన్ని గ్రామాల మీదుగా నడవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డి , ఎంపీపీ పురం నవనీత రవి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు మహేష్ , సర్పంచులు మాధవ రెడ్డి, అర్జున్, ఉప సర్పంచ్ లు రెనుకుమర్, వీరేశం, ప్రభాకర్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.