రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,16/04/2022

సూర్యాపేట DSP శ్రీ మోహన్ కుమార్ గారు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 16/04/2022 రోజున ఉదయం సమయమున సూర్యాపేట పట్టణము లోని పట్టణ పోలిస్ స్టేషన్ పరిధిలో గల కొత్త వ్యవసాయ మార్కెట్ వద్ద పెట్రోలింగ్ చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు తొమ్మిది మోటార్ సైకిల్ ల యుక్తము గా అనుమానాస్పదం గా కనిపించుటము వలన వారి వద్దకు వెళ్ళి వివరములు అడగగా వారు చెప్పకుండా పారిపోవుట కు ప్రయత్నిస్తుండగా చాకచక్యం గా వారిని పట్టుబడి చేసి విచారించగా వారి 1. కునుకుంట్ల వేణు 2. కిన్నెర నవీన్ వీరి తో పాటు మరొకరు కూడా వీరి స్నేహితుడు. వీరు చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు లోనై జల్సాలకు అలవాటు పడి సులభము గా డబ్బు సంపాదించలి అనే ఉద్దేశ్యం తో మోటార్ సైకిల్ లను దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకని హైదరాబాద్, మోతే , సూర్యాపేట పట్టణం లోని వివిధ ప్రాంతాల లో మోటార్ సైకిల్ లను దొంగతనం చేసి కొత్త వ్యవసాయ మార్కెట్ ప్రక్కన గల ఖాళీ ప్రదేశం లో ఉంచి వాటిని వేరే ప్రాంతములో అమ్ముటకు ఈరోజు వాటిని తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అట్టి మోటార్ సైకిల్ ల యుక్తము గా వారిని పట్టుబడి చేయనైనది. ఇట్టి రికవరీ సొమ్ము మొత్తం విలువ రూపాయలు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు.ఇట్టి కేసు చేదించిన పట్టణ సీఐ A. ఆంజనేయులు, ఎస్. ఐ. లు p. శ్రీనివాస్, క్రాంతితకుమర్, షేక్ యాకూబ్, E. సైదులు, ASI M. అంజయ్య, HC G. కృష్ణయ్య, HG లు CH. మధు, D. రాజు లను DSP మోహన్ కుమార్ గారు అభినందించారు