జిన్నారం రాయల్ పోస్ట్ న్యూస్: మాకొద్దు ఈ కంకర క్వారీ అంటూ ముక్త కంఠంతో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకున్న రాళ్ల కత్వ గ్రామస్తులు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికి వచ్చిన అధికారులు గ్రామస్తుల వ్యతిరేక నినాదాలతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని సోలక్పల్లి రెవిన్యూ పరిధిలో 286 286/1 పి విజయ్ భాస్కర్ రెడ్డి కి 13.85 ఎక్టర్ల లో కంకర క్వారీ ఏర్పాటుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆర్డిఓ నాగేష్ మైనింగ్ అధికారుల కాన్వాయ్ ను అడ్డుకొని గ్రామస్తులు ప్రజాప్రతినిధులు మాకొద్దు ఈ కంకర క్వారీ అంటూ నినాదాలు చేస్తూ అధికారులు వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ఇదే సమయంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి జిల్లా మైనింగ్ అధికారి రమేష్ కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవికుమార్ లు పక్కదారిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ప్రజాప్రతినిధులు జడ్పీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్, సర్పంచ్ రామ మల్లేష్, బిజెపి ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ స్వాతి ప్రభాకర్ రెడ్డి, రాళ్ల కత్వ సోలక్పల్లి ఉట్ల గ్రామస్తులతో కలిసి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవద్దని దానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గ్రామ పరిధిలో ఇప్పటికే ఉన్న కంకర క్వారీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడి పేలుళ్ల ధాటికి గ్రామంలో ఇల్లు పగుళ్లు బీటలు వారుతున్నాయని బోరుబావుల కూలిపోతున్నాయని కంకర క్వారీ నుంచి వచ్చే దుమ్ము పడి పంటలు నష్టపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నూతన కంకర క్వారీ ఏర్పాటు చెయ్యొద్దని ప్రజాప్రతినిధులు సైతం ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.చాలాసేపు ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని నిరసనలు వెల్లువెత్తాయి . దీంతో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి గ్రామస్తులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించాలని కోరగా గ్రామస్తులు ప్రజాప్రతినిధులు వినక పోవడంతో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే సమావేశాన్ని ముగిసినట్లు తెలిపి అధికారులు అందరూ అక్కడనుండి వెళ్ళిపోయారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గ్రామస్తులు అందరూ ఐక్యంగా ఉండి కంకర క్వారీ కి ఏర్పాటుకు వ్యతిరేకంగా ముందుకు వచ్చారు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అధికారులు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో కంకర క్వారీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని ఒకవేళ ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగు రమేష్, శివనగర్ సర్పంచ్ కృష్ణ రేఖ, ఎంపీటీసీ సంతోష మహేష్, ఉట్ల సర్పంచ్ కొరివి ఆంజనేయులు, కొడకంచి సర్పంచ్ శివరాజు,రాళ్ల కత్వ ఉపసర్పంచ్ అది గణేష్, పాలకవర్గ సభ్యులు, జగన్ రెడ్డి ఆది రామకృష్ణ,గ్రామ పెద్దలు, యువకులు,మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.