రాయల్ పోస్ట్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 16 జిల్లా ప్రతినిధి,
టిఆర్ఎస్ పార్టీ బంట్వారం మండల అధ్యక్షుడు రాములు యాదవ్ ఆధ్వర్యంలో ,గురువారం నాడు,
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్”మీతో నేను” కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండల పరిధిలోని బొపునారం గ్రామంలో 7 గంటల నుంచి 1 గంట వరకు పర్యటించారు.అనంతరం, ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ
పల్లె ప్రగతి సక్రమంగా అమలు చేయాలని పాడుబడ్డ ఇండ్లు మరియు ఇళ్ళ మధ్యల పెంట కుప్పలు వెంటనే తొలగించాలని, బావులుపై పైకప్పులు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని మండల స్థాయి అధికారులను, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు మరమ్మతులు చేయాలని ప్రతి వార్డులో ప్రతి ఇంటికి నీరు అందించాలని, పైపులైన్ కు గేట్ వాల్వ్ ఏర్పాటు చేయాలని, వారానికి ఒక సారి మంచినీటి ట్యాంకు శుభ్రం చేయాలని, ప్రజలందరూ నల్లాలకు చెర్రలు తీయకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.
బొపునారం గ్రామం నుండి వికారాబాద్ వరకు రాత్రి ఉదయం బస్సు సౌకర్యం కావాలని కోరగా… వికారాబాద్ బస్సు డిపో మేనేజర్ తో మాట్లాడి ప్రజల కోరిక మేరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, ఇళ్లపై నుండి ఉన్న విద్యుత్ లైన్లను సరి చేయాలని, గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేయాలన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కాకుండా గ్రామంలోనే పింక్షన్ లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో,బొపునారం గ్రామ సర్పంచ్ కల్పన .పి ఎస్ సి అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రైతు సమితి మండల అధ్యక్షులు ఖాజా పాషా, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు అంజి ,సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు నర్సింలు, ఎంపీటీసీల ఫోరం, ప్రశాంతి చెన్నారెడ్డి. ,తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామ సర్పంచులు,బంట్వారం గ్రామ అధ్యక్షుడు శాంతి కుమార్, యాచారం ఉపసర్పంచ్ ఖలీల్ పాషా ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.