రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ రాష్ట్రంలోని ఎయిడెడ్ జానియర్ కళాశాలల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో విలీనం గల సాద్య, అసాద్యాలను పరిశీలించడానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరిష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడెడ్ స్టాఫ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిద జిల్లాల ప్రతినిధులు మంత్రిని నానక్ రాంగూడలోని ఆయన నివాసంలో కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలల సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం కాని, ఇతర ఇబ్బందులు కూడలేవన్నారు. ఈ విషయమై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డితో పాటు ఉన్నతాధికారులతో కూడ చర్చించి నిర్ణయం తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భూపాల్ రెడ్డి, డాక్టర్ లక్ష్మయ్య, కృష్ణయ్య, శారద, డాక్టర్ పద్మావతి, మీనా కూమారి, సుజాత, నీల, కిషోర్, నర్సింహచారి, బబిత, మధుసూదన్, అంజు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.