రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,15/04/2022

సూర్యాపేట జిల్లా:
మునగాల మండలం
మాదారం వద్ద బైకును లారీ ఢీకొన్న
ప్రమాదంలో పెనుకొండ వీరయ్య(37) అక్కడికక్కడే మృతి చెందగా తమ్మిశెట్టి గురవయ్య(40)కు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన గురవయ్యను హుటాహుటిన
సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
వీరిద్దరిది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంగా గుర్తించారు.
సూర్యాపేట మండలం కందగట్ల గ్రామంలో
ఇటుక బట్టీలలో కూలీలుగా పనిచేస్తున్న
వీరు ఒకే ఊరుకు చెందిన వారు కావడంతో గురువారం స్వగ్రామలో ఫంక్షన్ కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో
ఈ ప్రమాదం జరిగింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.