తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించబడ్డ భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియామకాన్ని హర్షిస్తూ
ఆనందోత్సవాల కాంగ్రెస్ కార్యకర్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పట్టణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి పార్లమెంటు సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని నియమించినందుకు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపి మాట్లాడుతూ ప్రజా నాయకుడు తెలంగాణవాది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభిమాన నాయకుడిగా ప్రజల కష్టాలు తమ కష్టాలుగా భావించే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ఇచ్చిన విధంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ చేయడం ఇది ప్రజల అభిమానంగా ప్రజల విజయంగా భావిస్తూ రానున్న శాసనసభ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయమని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు అయిన బిజెపి టిఆర్ఎస్ చేస్తున్న అరాచక పాలనను అంతమొందించడం కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించే ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు వచ్చే గొప్ప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే జీవిస్తున్న గొప్ప మహా నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ కావడం అభినందనీయమని అన్నారు .