బుడ్డాయి పల్లి లో 44 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం పంపిణీ: శాసనసభ్యులు క్రాంతి కిరణ్

జోగిపేట: రాయల్ పోస్ట్:ఏప్రిల్ 5:దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వట్టిపల్లి మండలం పరిధిలోని బుడ్డాయి పల్లి గ్రామంలో 44 మంది లబ్ధిదారులకు వివిధ రకాల దళిత బందు పంపిణీ కార్యక్రమాన్ని అందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి దళిత బంద్ కంపెనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి దళితులఅభివృద్ధి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని దళిత బంద్ పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. వట్టిపల్లి మండలం తాసిల్దార్ వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.