పదోన్నతి పొందిన పోలీసులకు సన్మానం

రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా నెన్నెల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన జె.సత్తయ్య,పి మరియన్ లకు మంగళవారం ఘనంగా సన్మానించారు. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ ఐ రాజాశేఖర్ శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహించి పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను పెంపొందించాలన్నారు.