చెరువులో పడి మహిళా మృతి
రాయల్ పోస్ట్ ప్రతినిధి మనోహరాబాద్‌,04 ఏప్రిల్‌ :
చెరువులో పడి ఓ మహిళ గల్లంతైన సంఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాలీలా ఉన్నాయి.మెదక్ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారం గ్రామానికి చెందిన కర్రె పోచమ్మ (45) చెరువులో ప్రమాదవశాత్తు మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజు గౌడ్‌ ఘటన స్థలానికి వెళ్లి గజ ఈతగాళ్లతో మహిళ కోసం రెండు రోజులు గా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్ మార్ట్ నిమ్మితం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించినట్లు పోలీసులు తెలిపారు. వేసవి కావడంతో చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లే వారు పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నపిల్లలను, యువకులను చెరువుల వద్దకు వెళ్లకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ రాజు గౌడ్ ప్రజలకు సూచించారు.