రాయల్ పోస్ట్ న్యూస్:రోడ్డు బాగు చెయ్యాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ నిరసన………..భువనగిరి పట్టణంలోని ప్రధాన కూడలి అయిన జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద రోడ్డు మరమ్మత్తులు చెయ్యాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ నిరసన తెలిపారు. అతహర్ మాట్లాడుతూ జగదేవ్ పూర్ చౌరస్తా నుండి ప్రజ్ఞాపూర్ వెళ్లే దారిలో గత కొంతకాలంగా రోడ్డు పూర్తి మరమ్మత్తులకు నోచుకోవడం లేదని ఎన్ని సార్లు చెప్పిన అధికారులు తూతూ మంత్రంగా మాత్రమే రోడ్డు మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈరోడ్డు గుండా వెళ్లే ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురైతున్నారని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వలని చీకటి సమయంలో బైక్ పై వచ్చే వారు కింద పడి గాయల పాలైతున్నారని వాపోయారు.ఈ రోడ్డు గుండా అనేక పెద్ద పెద్ద వాహనాలు వెళ్తూ ఉండడమే కాక ఆర్డఓ ఆఫీస్, డీసీపీ ఆఫీస్ ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలు పహడినగర్,తాత నగర్,ఓంకార్ ఆశ్రమం, ఇందిరమ్మ కాలనీ ఇలా ఇంతో మంది నివసించే ప్రాంతాలు కలవు.రోడ్డు చుట్టుపక్కల నుండి వచ్చే మురుకి కాలువలకు శాశ్వత పరిష్కారం లేనందున ఇలా మాటి మాటికి రోడ్డు చెడిపోతుందని దానికి శాశ్వత పరిష్కారం చూపి సీసీ రోడ్డు వేయాలని అతహర్ డిమాండ్ చేశారు.అసలు భువనగిరి పట్టణానికి ప్రజా ప్రతినిధులు ఉన్నారా లేరా అర్థం కావడం లేదని ఎటు చూసినా సమస్యలేనని వాటిని పరిష్కరించే నాధుడే లేరని అన్నారు.అధికారులకు ఫోన్ చేస్తే ఇది మా పరిధిలోకి రాదు అని యథేచ్ఛగా చేతులు దులుపుకుంటున్నారు. ప్రజల వద్ద వసూలు చేసే పన్నులతో ప్రజలకు సౌకర్యాలు కలిపించకపోవడం ఎంత వరకు సమంజసం అని అన్నారు.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు భువనగిరి పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేని యెడల రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో సమాదానం చెప్పడం కాయమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోమైనారిటీ నాయకులు వాహీద్, పట్టణ కో ఆర్డినెటర్ సాయి నివాస్,ఆదిల్,అయుబ్, జుబైర్, గణేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు…