ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచి ధరల పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనకుండా మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు: టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ,రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతులను దగా చేస్తూ, రెండు ప్రభుత్వాల మధ్య లో రైతులను నట్టేట ముంచి చోద్యం చూస్తున్న వైనాన్ని ,మరియు పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ విపరీతంగా పెంచుతూ ప్రజలను దోచుకుంటూ ధరల పెరుగుదలపై ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కాలం గడుపుతున్న వైనాన్ని, ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో మరో కొత్త పిడుగును కురిపించి ప్రజలందరూ అప్పులపాలు అయ్యేవిధంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని మున్సిపల్, మండల, కార్పొరేషన్ కేంద్రాలలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు నిరసన ప్రదర్శనలు చేసి మోడీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ పట్టణంలో, శామీర్ పేట మండల కార్యాలయం ముందు గల అంబేద్కర్ గారి విగ్రహాల ముందు మేడ్చల్ నియోజకవర్గ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ, మేడ్చల్ మండల, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ,మేడ్చల్ మున్సిపల్, శామీర్ పేట మండలం, మూడు చింతలపల్లి మండలం, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరేణి పోచయ్య , గోమారం రమణారెడ్డి ,సాయి పేట శ్రీనివాస్ ,వేముల శ్రీనివాస రెడ్డి . యాష్కీ శంకర్ గౌడ్,బొమ్మల పల్లి నరసింహులు యాదవ్, జైపాల్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి ,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , పాల్గొని ప్రసంగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కుమ్మకై ప్రజలను దోచుకుంటున్నారని , పెరిగిన ధరల వల్ల ప్రజలు బ్రతకలేక పోతున్నారని ,రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనకుండా తాత్సారం చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారని ,ఒక్క రైతు బలవన్మరణం చెందినా అది కేంద్రంలోని మోడీ ,రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి వస్తుందని ,రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధరల నియంత్రణ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని కావున ఒక ఏడాది పాటు ప్రజలు సహనంతో ఉండాలని ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చేస్తామని రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానం తీసుకువస్తామని తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాలలో హరి వర్ధన్ రెడ్డి గారి తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌడవెల్లి బాల్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ జనరల్ సెక్రటరీ జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి గరిశల సురేందర్ ముదిరాజ్ గారు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ గువ్వ రవి ముదిరాజ్ గారు, దుడ్డు సంజీవరావు గారు, పానుగంటి సత్తయ్య గారు, అశోక్ గౌడ్ గారు, రేగు రాజు గారు,ఎర్రోళ్ల కృష్ణ గారు, రామకృష్ణా రెడ్డి గారు, వినోద్ గౌడ్ గారు, సాయి బాబా గారు, వెంకటేష్ యాదవ్ గారు, శ్రీశైలం గారు సుధాకర్ గారు, మురళి గౌడ్ గారు ,శంకర్ ముదిరాజ్ గారు, బిక్షపతి గారు, ప్రేమ లత గారు, అవినాష్ గారు, సుధాకర్ గారు, శేఖర్ గారు,మధు, ఉమ్మడి శామీర్ పేట మండల నాయకులు అలియాబాద్ ఎంపిటిసి అశోక్ గారు ,మహేందర్ యాదవ్ గారు, ఆంజనేయులు ముదిరాజ్ గారు ,యాష్కీ నాగేష్ గౌడ్ గారు, పొన్నాల గ్రామ ఉపసర్పంచ్ గడ్డం రమేష్ గారు, బండి రామ్ రెడ్డి గారు, జస్వంత్ రెడ్డి గారు, రాజయ్య గారు, యాదగిరి గారు ,కీసరి నరసింహులు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు ,జాఫర్ గారు ,మల్లేష్ గారు, శశీందర్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, వాసుదేవ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, తుంకి బిక్షపతి గారు, వీరేశం సేటు గారు, యాదాస్ బిక్షపతి గారు, నరసింహులు గారు తదితర నాయకులు పాల్గొన్నారు