శ్రీ సంతోషిమాత దేవాలయం లో పంచాంగ శ్రవణం
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట, 02/04)2022
శుభకృత్ నామ సంవత్సరము ఉగాది పురస్కరించుకొని శనివారం శ్రీ సంతోషిమాత దేవాలయం లో దేవాలయం ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శ్రీ సంతోషిమాత కు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు పంచాంగ శ్రవణం ను వినిపించారు..రాశి ఫలాలతో పాటు ఆదాయ వ్యయాలు తెలిపారు. శ్రీ సంతోషిమాత కు 8 ఆదాయం 8 ఖర్చుగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది మంచి ఫలితాలు ఉంటాయి అని తెలిపారు. అంతకు నూతన దస్త్ర పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష,కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్, కమిటీ సభ్యులు నరేంద్రుని విద్యాసాగర్ రావు యామా పురుషోత్తం, బోనగిరి విజయకుమార్ ,సోమ శ్రీశైలం, పాలవరపు రామమూర్తి దేవరశెట్టి సోమయ్య బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య తిరునగరి యాదగిరి మహంకాళి ఉపేందర్ సోమశేఖర్, కొల్లూరు రత్నమాల దేవాలయ సహాయకులు మంగిపూడి వీరభద్ర శర్మ ,భట్టారం వంశీ కృష్ణశర్మ దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.