మన ఊరి మన బడి పనులకు

10 రోజుల్లో అనుమతులు
రాయల్ పోస్ట్ న్యూస్
హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్టాత్మక “మన ఊరు “మన మనబడి కార్యక్రమంలో చేపట్టే పనులకు 15 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను,ఇంజనీర్లను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇవ్వాలని సూచించారు. ‘మన ఊరు- మన బడి’ పై సందీప్ కుమార్ సుల్తానియా హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాము సూచించిన ఎనిమిది పనులను మాత్రమే చేపట్టాలని ఆదేశించారు. నిధుల మంజూరుకు జాయింట్ చెక్ పవర్ను సంబంధిత పాఠశాల హెచ్ఎం, SMC చైర్మన్ వరకే పరిమితం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లకు ఆదేశాలిచ్చారు.
మన ఊరు మన బడి పనులకు ఆన్లైన్ మాడ్యూల్ ద్వారా 10 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి
అన్ని పాఠశాలలకు లాగిన్ ఐడి లు కేటాయించాం వాటిని ఉపయోగించుకోవచ్చు
రాబోయే ఐదు రోజుల్లో ప్రతి మండలంలో లో 2 స్కూళ్ళలో
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి
గ్రామీణ ప్రాంతాల్లో 5, పట్టణ ప్రాంతాల్లో 8 సివిల్ వర్క్సకు పరిపాలనాపరమైన అనుమతులతో పాటు సాంకేతిక అనుమతులు ఇవ్వాలి
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే మూడు రకాల పనులు, కొత్త నిర్మాణాల కోసం పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల ద్వారా అనుమతులు తీసుకోవాలి
తక్షణమే ఇంజనీర్లు ఆన్లైన్ మాడ్యూల్ లో అంచనాలను తయారు చేయాలి ఇలా రూ.30 లక్షల లోపు ఉన్న పనులకు అంచనాలు సిద్ధం చేసుకోవచ్చు.
పరిపాలన అనుమతులు పొందిన పనులకోసం 10% నిధులను అడ్వాన్స్ గా స్కూల్ ల్ మేనేజ్మెంట్ కమిటీ (స్ఎంసీ) లకు అందజేస్తాం.
మండలాల స్పెషల్ ఆఫీసర్ డి ఈ ఓ ల నుంచి అంచనాలను తీసుకొని, అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలి. పనుల నాణ్యతను పరిశీలించాలి.
జిన్నారం ఎస్ఎంసి ఏర్పుల భాస్కర్ చైర్మన్