సూర్యాపేట జిల్లా.
ప్రారంభమైన జిల్లా పోలీసు వార్షిక క్రీడలు.

క్రీడలు ప్రారంభించిన జిల్లా జడ్జ్ వసంత్ పాటిల్
జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్

హాజరైన జిల్లా అధనపు ఎస్పీ రితిరాజ్ డిఎస్పీలు రఘు, మోహన్ కుమార్, రవి, సి.ఐ లు,అర్. ఐ.లు ,ఏస్సైలు, క్రీడాకారులు, పోలీసు అధికారుల సంఘం
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యాపేట,03/04/2022
జిల్లా జడ్జి వసంత్ పాటిల్ మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసాన్ని, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. జిల్లా ఏర్పడినాక ఇలాంటి క్రీడల టోర్నీ ఏర్పాటు చేయడం చాలా ఆనందం, ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ ఆర్పీ పోలీసు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. క్రీడాకారులకు శుభాకంక్షలు తెలిపినారు. పోలీసు ఉద్యోగం అనేది వత్తిడి, శ్రమతో కూడిన ఇలాంటి వత్తిడులు అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు బాగా ఉపయోగపడుతాయి అన్నారు, సమాజంలో పోలీసు పాత్ర అనేది అత్యంత కీలకం అని జిల్లా జడ్జి గారు అన్నారు. ప్రతి ఒక్కరూ బాగా ఆడాలి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. గెలుపు ఓటములు సహజం యుద్ధం చేయడం, పోరాటం ముఖ్యం అని తెలిపినారు.

ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కోరిక మేరకు ఈ టోర్నీ వార్షిక క్రీడలు నిర్వహిస్తున్నాం, ప్రతి ఒక్కరూ గెలుపుకోసం ఆడాలి, క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలి, జిల్లా పేరును నిలపడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి అన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపినారు.

అదనపు ఎస్పీ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపినారు.

సి.ఐ లు విఠల్ రెడ్డి, ఆంజనేయులు, రాజేష్, శ్రీనివాస్, ఆంజనేయులు, నాగర్జున, పి.ఎన్.డి ప్రసాద్, రామలింగారెడ్డి, నర్సింహారావు, ఆర్.ఐ లు నర్సింహారావు, గోవిందరావు, శ్రీనివాస్, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.