పెట్రోల్, డీజిల్,గ్యాస్, ధరలను తగ్గించాలి-సీపీఎం మండల కార్యదర్శి బుర్రు.అనిల్ కుమార్ గ్యాస్ సిలిండర్లుతో వినూత్న నిరసన
రాయల్ పోస్ట్ ప్రతినిధి ఆత్మకూర్ ఎం భువనగిరి: సీపీఎం అల్ ఇండియా కమిటీ లో పిలుపు లో భాగంగా స్థానిక అంబెడ్కర్ చౌరస్తా దగ్గర గ్యాస్ సిలిండర్లతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా సీపీఎం అడ్డగుడూర్ మండల కార్యదర్శి బుర్రు.అనిల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్యం నిత్యం పెట్రోల్,డీజిల్,గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుకుంటూ పేద,మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతూ సామాన్య ప్రజల నడ్డివిరిస్తుంది బీజేపీ ప్రభుత్యం.పేదల కోసం మా ప్రభుత్వాలు పని చేస్తున్నాయి అన్ని చెప్పేటువంటి బీజేపీ నాయకులు ధరలను ఎందుకు అదుపు చేయలేక పోతున్నాయి అన్ని విమర్శించారు.దేశంలో బీజేపీ ప్రభుత్యం, ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ధారదతంగా ప్రైవేట్ పరం చేస్తూ సామాన్య ప్రజలకు పని కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు అదే విదంగా బీజేపీ ప్రభుత్యం ఇస్తాన ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని సీపీఎం పార్టీ గా బీజేపీ ప్రభుత్వని డిమాండ్ చేస్తునం.తక్షణమే దేశ వ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్, ధరలను అదుపు చేయపోతే రాష్ట్రంలో బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ మండల కార్యదర్శి వల్లంభట్ల శ్రీనివాసరావు, మండల నాయకులు ఎర్ర భూపల్ రెడ్డి,మండల నాగేశ్వరరావు, సీపీఐ మండల నాయకులు చుక్క ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.