పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ఆర్టీసీ ధరలను. వెంటనే తగ్గించాలని సిపిఎం. సిపిఎం నాయకులు. డిమాండ్ చేశారు.
వికారాబాద్. ఏప్రిల్ 3(రాయల్ పోస్ట్ ) జిల్లా ప్రతినిధి:(సంపత్ కుమార్) :
ఆదివారం రోజు వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద, నిరసనలు చెప్పి వాల్ పోస్టర్ విడుదల చేశారు,సీపీఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి .మల్లేశం మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించాలని పేద ప్రజలు రోజురోజుకు ధరల పెరుగుదల వల్ల పేదలు కార్మికులు రైతులు కష్టజీవులు మూడు పూటలా తిండి తినలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆర్టీసీ చార్జీలు తగ్గించకుండా ప్రజల పైన భారాలు వేస్తూ పెట్టుబడి దారులకు కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డరు. అందుకు రాబోయే రోజులలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ప్రజావ్యతిరేక విధానాలకు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు మేధావులు ఉద్యోగులు పెద్దఎత్తున పోరాటం చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు పెట్టుబడులకు ధారాదత్తం చేస్తూ పేద ప్రజల పైన పెద్ద ఎత్తున భారాలు మోపుతున్న అటువంటి పరిస్థితి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు కేవీప్స్ డైఫీ రైతు సంఘాల నాయకులు, ఆర్.మహిపాల్ .అశోక్ ,.సుభాష్ ,.సుదర్శన్ .హరికృష్ణ .శ్రను నాయక్, రాములు రాజు శ్రీకాంత్,శంకర్ లు పాల్గొన్నరు