పారదర్శకంగా దళిత బందు యూనిట్ల గ్రౌండింగ్

ఆయా నియోజక వర్గాల్లో లబ్ధిదారులు తప్పక పాల్గొనాలి.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్ సూర్యాపేట,03/04/2022
జిల్లాలోని దళిత బందు పథకం క్రింద నాలుగు నియోజక వర్గాల్లో ఎంపిక చేసిన లబ్దిదారులకు జిల్లా యస్.సి. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5 న ఆయా నియోజక వర్గాల్లో యూనిట్లను గ్రౌండింగ్ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి లబ్దిదారులకు ముందస్తు సమాచారం అందించాలని నియమించిన ప్రత్యేక అధికారులు , సంబంధిత శాఖ అధికారులు అలాగే మండలస్థాయి కమిటీలకు సూచించడం జరిగిందని తెలిపారు. ఏర్పాటు చేసే కార్యక్రమాలలో శాసన సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని తెలిపారు. లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ లో సూర్యాపేట నియోజక వర్గానికి సంబంధించి స్థానిక రవి కన్వెన్షన్ హాల్ లో అలాగే కోదాడ నియోజక వర్గానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయం గుడిబండ నందు అలాగే తుంగతుర్తి నియోజక వర్గానికి సంబంధించి తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం నందు , అర్వపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం అలాగే హుజూర్ నగర్ నియోజక వర్గానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయం, కిష్టాపూర్, చింతల పాలెం మండలం అలాగే గ్రామపంచాయతీ కార్యాలయం కోమటి కుంట్ల , పాలకీడు మండలంలో లబ్దిదారులకు అందచేసే యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యoగా వేసవి దృష్ట్యా త్రాగునీరు, కల్పించాలని సూచించారు. యూనిట్ల గ్రౌండింగ్ లో లబ్ధిదారులు తప్పక హాజరు కాగలరని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.