నేడు రక్తదాన శిబిరం
కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అమృతం బాలరాజు

ఆలేరు ఏప్రిల్ 2, రాయల్ పోస్ట్ ప్రతినిధి ,డి అంబిక…
మండలంలోని కొలనుపాకలో సామాజిక సేవకుడు సొంటెం సోములు రెండో వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అమృతం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేయడానికి రక్త దాతలు శిబిరానికి తరలిరావాలని పిలుపునిచ్చారు