డబిల్ పూర్ గ్రామంలో పంచాంగ శ్రావణం.లో పాల్లోనగ్రామ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాగ్యరెడ్డి.

రాయల్ పోస్ట్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలంలోని డబిల్ పూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రావణం నిర్వహించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని డబిల్ పూర్ గ్రామంలో పూజారి ప్రశాంత్ నాయకులకు, ప్రజలకు పంచాంగ శ్రవనాన్ని వివరించారు. ఈ ఏడూ ప్రజలందరూ సంతోషంగా ఉంటారని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పూజారి తెలియజేసారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు అంత మంచే జరుగుతుందని పంచాంగ శ్రవణం లో ప్రశాంత్ స్పష్టంగా వివరించి చెప్పారు. ఈ పంచాంగ శ్రవణం లో డబిల్ పూర్ గ్రామ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భాగ్యరెడ్డి, మాజీ ఎంపీటీసీ సత్యనాయణ, ఉప సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు శ్రీ రామ్ రెడ్డి, అశోక్, రామోదర్ రెడ్డి, తాళ్ల హరి, బాల్ రెడ్డి, సుదర్శన్, నారాయణ దాస్, నందు, సంజీవ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.