ఉగాది పండగ సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా ,జహీరాబాద్ 02 ఏప్రిల్, రాయల్ పోస్ట్ న్యూస్: ఉగాది పండుగ ను పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణం లోని రాంనగర్ కలనీ లో పట్టణ యూత్ అద్యక్షులు కళ్లెం రవీందర్ గారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుక సంతోషాలతో ఉండాలని శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.అంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహివుద్దిన్, సీనియర్ నాయకులు ఇజ్రాయేల్ బాబీ, భాస్కర్, జాకీర్, చంద్రయ్య, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.