ఆల్ ఇండియా మ్యాథ్స్ ఒలంపియాడ్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ తో అద్భుత ప్రతిభ కనపరిచిన విద్యార్థిని (డిజె సిస్టర్స్) కి మంత్రి అభినందనలు
రాయల్ పోస్ట్ ప్రతినిధి, మక్సుద్, సూర్యపేట 03/04/2022

ఆల్ ఇండియా ISMO (మాథ్స్ ఒలంపియాడ్) 21-22 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కి చెందిన విద్యార్థిని బుర్ర జీ నా ప్రియ శ్రీ (డిజే సిస్టర్స్) స్థానిక నారాయణ విద్యా సంస్థల్లో ఏడవ తరగతి చదువుతూ పోటీపరీక్షల్లో ఆలిండియా 94 ర్యాంక్ తెలంగాణ స్టేట్ 16 ర్యాంక్ సూర్యాపేట జిల్లా మొదటి ర్యాంకు సాధించి అద్భుత ప్రతిభ కనపరిచిన పేట విద్యార్థిని
బుర్ర జీనా ప్రియ శ్రీ ( డీజే సిస్టర్స్) కి నిన్న 46, 47 వార్డుల్లో నిర్వహించిన ఉగాది పురస్కారాలు సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ గారు మరియు గ్రంథాలయ చైర్మన్ నిమ్మల
శ్రీను వాస్ గౌడ్ గారు మరియు ఇతర నాయకులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు బుర్ర శ్రీనివాస్ సరస్వతి గార్లు పాల్గొన్నారు విద్యార్థిని తల్లిదండ్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారి జీ నా ప్రియ శ్రీ నేషనల్ డాన్సర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ తన ప్రతిభను కనపరచి ఎన్నో అవార్డులను ఈ జిల్లాకు తీసుకొచ్చింది ఇప్పుడు చదువులో కూడా తన ప్రతిభను కనపరుస్తూ ఆలిండియా 94 ర్యాంకు సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అభినందనలు తెలియజేసినందుకు మంత్రి గారికి మరియు వార్డ్ కౌన్సిలర్ గారికి మరియు వార్డు ప్రజలందరికీ ఇంతగా కృషి చేసిన నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.