తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 80,039 ఉద్యోగాల నియామక ప్రకటన చేయడం జరిగింది. అందులో పోలీస్ శాఖలో 18,334 ఉద్యోగాలకు నియామకం జరుగబోతున్నది. పోలీస్ శాఖలో ఎస్.ఐ. మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందాలనుకునే యువతీ యువకులకు ఇంతకంటే మంచి అవకాశం లేదు.
ఇది పోటీ ప్రపంచం. ఉద్యోగం కావాలంటే పోటీ పరీక్షలలో నెగ్గాలి. అందులో పోలీస్ ఉద్యోగం సాధించాలంటే శారీరక సామర్థ్య పరీక్షతో పాటు ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల్లో నెగ్గాలి.

మరి కోచింగ్ ఎలా ?
రాచకొండ పోలీస్ కమీషనర్, శ్రీ మహేష్ మురళీధర్ భగవత్ IPS గారి అధ్వర్యంలో, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, యదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, స్వచ్చంద సంస్థలు మరియు దాతల సహాయ సహకారాలతో  పోలీస్ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయబడినది.
ఈ కోచింగ్ అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలైన మల్కాజ్ గిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఎల్.బి.నగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో ఇవ్వబడును.

శారీరక సామర్థ్య పరీక్ష కొరకు పోలీస్ శాఖలో ఆర్మ్డ్ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న RI, RSI లు మరియు సిబ్బంది శిక్షణ ఇస్తారు.
ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల కొరకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ లో అనేక సంవత్సరాలు అనుభవం కలిగిన ఫ్యాకల్టీ మెంబర్స్ తో కోచింగ్ ఇవ్వబడును.
గతం లో రాచకొండ పోలీస్ ద్వారా కోచింగ్ తీసుకొని 588 మంది పోలీస్ ఉద్యోగాలకు ఎంపికై ప్రస్తుతం వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు.

మీరు కూడా ఈ కోచింగ్ లో చేరి పోలీస్ కావాలనుకునే కలను నిజం చేసుకోండి.
 మహిళలకు సువర్ణావకాశం
పోలీస్ శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడినది. దీనితో మహిళలకు కూడా పోలీస్ ఉద్యోగం పొందడానికి ఇదే మంచి అవకాశం.
పోలీస్ జాబ్స్ కొరకు కోచింగ్ లో చేరాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 5వ తేదీ, మంగళవారం సాయంత్రం 6 గంటలలోగా క్రింద తెలుపబడిన QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి.

అభ్యర్థులు తమ సమీప పోలీస్ స్టేషన్ కు వ్యక్తిగతంగా వెళ్లి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకుగాను తమవెంట ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆధార్ కార్డు, నివాసము మరియు కుల ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకెళ్ళాలి.
పురుషులు 167.6 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ ఎత్తు ఉన్నవారు మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి.
ఈ అవకాశం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి లో నివాసం ఉండే అభ్యర్థులకు మాత్రమే మరియు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
      
పి. ఆర్. ఓ , రాచకొండ పోలీస్ కమీషనరేట్.