హైదరాబాద్: గాంధీభవన్ పంచాంగ పఠనంలో పలు సంచలన విషయాలను వేద పండితులు శ్రీనివాస మూర్తి వెల్లడించారు. కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందని ఆయన వెల్లడించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్నీ చవిచూస్తాయన్నారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోందన్నారు. అక్టోబర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపుతారని శ్రీనివాసమూర్తి తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం రేవంత్ తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తరపున సమరోత్సహంతో పని చేస్తామన్నారు. 42లక్షల మెంబర్ షిప్ చేసుకున్నామని వెల్లడించారు. 80లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు వస్తాయని రేవంత్ తెలిపారు. ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యం తేవాలన్నారు. పార్లమెంట్‌లో సోనియమ్మ, మీరాకుమార్, సుష్మాస్వరాజ్‌తో తెలంగాణ వచ్చిందన్నారు. అలాంటి తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని రేవంత్ వాపోయారు.*