రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:భువనగిరి పురపాలక సంఘం సాధారణ సమావేశం ఈరోజు కౌన్సిల్ హాల్ అందు నిర్వహించగా మున్సిపల్ చైర్మన్ ఎన్న బోయిన ఆంజనేయులు అధ్యక్షతన సమావేశం ప్రారంభంకాగా మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్ర రావు వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య గౌరవ కౌన్సిలర్లు పాల్గొన్న సమావేశం 33వ వార్డు కౌన్సిలర్ అవచిక క్రాంతి మాట్లాడుతూ ప్రతిపక్ష వార్డులలో ఎలాంటి ఎస్టిమేషన్ లు లేకుండా కౌన్సిల్ తీర్మానం కాకుండా టెండర్ ప్రక్రియ లేకుండానే పనులు జరిగినవి అవి వాస్తవమా కాదా ఇలా జరగడం వల్ల అధికార పార్టీలో ఉండి కూడా అసమర్ధులుగా ఉన్నామని మావార్డు ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు దీనిపైన స్పష్టమైన సమాధానం ఇవ్వాలని సమాధానం ఇచ్చేంత వరకు ఎజెండా అంశాలును అడ్డుకున్న 33వ వార్డు కౌన్సిలర్ అవఛిక క్రాంతి
దీనికి స్పందిస్తూ 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక మాట్లాడుతూ మా పార్టీ వాళ్లు కాదు అధికార పార్టీ గౌరవ ఛైర్మన్ 2వ వార్డులో మరియు 30 వ వార్డులో కూడా ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా కౌన్సిల్ తీర్మానం లేకుండా టెండర్ ప్రక్రియ లేకుండా సుమారు ఒక్క ఒక్క వార్డులలో ఏడు లక్షల పైన అభివృద్ధి పనులు జరిగినాయి ఇవి వాస్తవాలు కాదా అని చైర్మన్ ను కమిషనర్ ను నిలదీస్తూ 23వ వార్డులో జిల్లా కలెక్టర్ శ్రీమతి అనితారామచంద్రన్ గారు వాటర్ ట్యాంక్ పైన స్లాబ్ వేయించమని సంవత్సరం క్రితం చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా పనులు చేయించలేదు మరి కౌన్సిల్ కు ఎలాంటి సంబంధం లేకుండా మున్సిపల్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా టెండర్ ప్రక్రియ పూర్తి కాకుండా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అన్ని నిలదీయడం జరిగింది దీనికి స్పందిస్తూ 30వ వార్డు కౌన్సిలర్ అజీమ్ ఉద్దీన్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుండి ఎఒక్క కౌన్సిలర్లు కు కూడా ఎలాంటి గౌరవం లేకుండా ఉన్నది ఆరు లక్షల రూపాయల పనులు చేసి అట్టి పనులు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదని అదనంగా లక్ష్మారెడ్డి ఇంటిముందు అసంపూర్తిగా ఉన్న మురికి కాలువ పూర్తి చేయమని లక్ష్మారెడ్డి నేను ఇద్దరం కలిసి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారిని కలిసి ఎన్నోమార్లు మా సమస్య గురించి వాళ్ళ దృష్టికి తీసుకు వచ్చిన కూడా పట్టించుకోకుండా మమ్మల్ని అవమాన పరిచారని పోడియం ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది అజీమ్ ఉద్దీన్ కు సంఘీభావంగా 8వ వార్డు కౌన్సిలర్ స్వామి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ గారు మా వార్డులో ఎప్పుడన్నా మీరు పర్యటన చేశారా మా వార్డులో కుక్క కరవడం వల్ల చాలామంది ఇబ్బందులకు గురి అవుతుంటే మున్సిపల్ జవాన్ల దాడి సానిటరీ ఇన్స్పెక్టర్ కు తెలియజేసిన కూడా ఎలాంటి స్పందన లేదని పిచ్చికుక్క మీరే కొట్టి చంపాలని మాకు చెబుతూ మమ్మల్ని అవమాన పరచాలని ఆవేదన వ్యక్తం చేశారు 26వ వార్డు కౌన్సిలర్ నరసింహ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న అన్ని వార్డులకు ఆరు లక్షల రూపాయలు పెట్టి మా 26వ వార్డు కు నాలుగు లక్షల 20 వేల రూపాయలు పెట్టారు మావార్డు కు రావాల్సిన ఇంకా రెండు లక్షల రూపాయలు ఇప్పటివరకు పెట్టకుండా మా వార్డు ప్రజలను మమ్మల్ని అవమాన పరుస్తున్నారు అన్ని నల్లని బట్టలతో నిరసన వ్యక్తం చేస్తూ పోడియం వద్ద నిరసన కూర్చడం జరిగింది దీనికి అనుగుణంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు పచ్చర్ల హేమలత తంగళ్ళపల్లి శ్రీవాణి కైరంకొండ వెంకటేష్ అందరూ పోడియం వద్ద కూర్చొని నిరసనకు దిగి మావార్డుల అభివృద్ధి నిధులు ఇప్పుడు కేటాయించ అంతవరకూ టేబుల్ ఎజెండా అంశం తీసుకున్నంత వరకు మేము కదిలేది లేదని పోడియం ముందు కూర్చడం జరిగింది వీళ్లకు మద్దతుగా బిజెపి పార్టీ కౌన్సిలర్ల కూడా జనగమం కవిత ఉదరి శ్రీలక్ష్మి రత్నపురం బలరాం పోడియం ముందు కూర్చోవడం జరిగింది ఈసందర్భంగా ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు పోత్నక్ ప్రమోద్ కుమార్ మాయ దశరథ మాట్లాడుతూ చైర్మన్ గారు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని వివిధ వార్డులలో గౌరవ కౌన్సిలర్లు అవచిక క్రాంతి గారు పడిగెల రేణుక గారు ఆరోపిస్తున్నరు మేము ఫ్లోర్ లీడర్లు మీటింగ్ లోనే మీ దృష్టికి తీసుకొని వచ్చి సాధారణ నిధుల నుండి వార్డులలో పనులు జరిగిన వాటిని వాటి తో పాటు ఇతర వార్డులలో కూడా సాధారణ నిధుల నుండి పనులు చేయించమని నెలకు 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించాలని మీ దృష్టికి తీసుకొని వస్తే మీరు ఇప్పుడు అభివృద్ధి జరిగిన పనులకు గౌరవ ఎమ్మెల్యే నిధులు అని చెప్పడం ఎంతవరకు సమంజసం కావున ఇట్టి ఎజెండాను వాయిదా వేయ్యాలని డిమాండ్ చేస్తుండగానే అధికార పార్టీకి చెందిన టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్30వవార్డు అజీమ్ ఉద్దీన్1వవార్డు కుశంగల ఎల్లమ్మ14వవార్డు గుండెగల్లా అంజమ్మ4వవార్డు నాయిని అరుణ15వవార్డు రహిమాన్ జహంగీర్16వ వార్డు కడారి ఉమాదేవి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లడం జరిగింది తదనంతరం మున్సిపల్ చైర్మన్ కమిషనర్ సమావేశాన్ని వాయిదా వేసే అంత వరకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు కౌన్సిలర్లు అందరూ పోడియం ముందు బైఠాయించి చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేస్తుంనాని ప్రకటించ అంతవరకు నిరసన తెలియజేస్తూనే ఉన్నారు