హరిత తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధించడమే ముఖ్యమంత్రి లక్ష్యం : ఎంపీపీ వీర్లపల్లి రజితరాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి.చిన్నారులకుఅన్నప్రాసన,అక్షరాభ్యాసం చేయించిన ఎంపీపీ వీర్లపల్లిరజితరాజమల్లారెడ్డి. రాయల్ పోస్ట్ ప్రతినిధి : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలంలోని రావల్ కోల్ఝ గ్రామంతో హరిత తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధించడమే ముఖ్యమంత్రి లక్ష్యం : ఎంపీపీ వీర్లపల్లి రజితరాజమల్లారెడ్డి, జడ్పీటీసీ అమ్మగారి శైలజ విజయానంద రెడ్డి.చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించిన ఎంపీపీ వీర్లపల్లి రజితరాజమల్లారెడ్డి
మేడ్చల్ మండల పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా మంగళవారం ఐసిడిఎస్ అధికారుల అధ్యక్షతన అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మండల ఎంపీపీ వీర్లపల్లి రజితరాజమల్లారెడ్డి, జడ్పీటీసీ అమ్మగారి శైలజ విజయానంద రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారి గర్భిణీలకు శ్రీమంతం చేసి, అనంతరం చిన్న పిల్లలకు అన్నప్రాసన, అక్షరభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంపీపీ వీర్లపల్లి రజితరాజమల్లారెడ్డి మాట్లాడుతూ. ఆరోగ్యమే మహాభాగ్యం అని, పౌష్టికాహార లోపం వల్ల అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని, పేదవారికి ప్రతి ఒక్కరికి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అద్భుతమైన పౌష్టికాహారం అందిస్తున్నారని వారు తెలిపారు. హరిత తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా స్త్రీలలో రక్తహీనత సమస్య ఏర్పడకుండా ఆరోగ్యకరమైన ఆకుకూరలు తీసుకోవాలని, 6 సంవత్సరాల లోపు పిల్లల బరువులు తగ్గడం వారి పెరుగుదల గురించి వారి తల్లులకు వివరిస్తు అంగన్వాడి కేంద్రంలో దొరికే వాటి గురించి వివరిస్తూ వాటి ప్రయోజనాలను ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం జడ్పీటీసీ అమ్మగారి శైలజ విజయానంద రెడ్డి మాట్లాడుతూ చిన్న పిల్లలకు పలక బలపం పట్టె ముందు చేపట్టే ముఖ్యమైన కార్యక్రమం అక్షరాభ్యాసమని పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల వైస్ ఎంపీపీ గోపని వెంకటేష్ ముదిరాజ్, గ్రామ సర్పంచ్ మహేందర్, సీడీపీఓ ఉదయశ్రీ, ఉప సర్పంచ్ రాజారాం, అంగన్వాడీ ఉపాధ్యాయులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, విద్యార్థుల తల్లులు, విద్యార్థులు పాల్గొన్నారు.