రాయల్ పోస్ట్ ప్రతినిధి

రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా సోమవారం సీఐటీయూ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బెల్లంపల్లి సీఐటీయూ కార్యాలయం నుండి కాంటా చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. ప్రజా సంఘాల నాయకులు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు. అబ్బో జు రమణ, డివైఎఫ్ఐ. జిల్లా ఉపాధ్యక్షుడు చల్లూరి దేవదాస్, అంగన్వాడి జిల్లా నాయకురాలు. కొంక పద్మ, ఆశా వర్కర్ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క,
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అధ్యక్షులు
గొడిసెల చంద్రమొగిలిలు మాట్లాడుతూ దేశంలో 2014. సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి, రక్షణ రంగం, రైల్వే, బిఎస్ఎన్ఎల్ తదితర లక్షల కోట్ల లాభాలు ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి కారుచౌకగా కట్టబెట్టిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజలపై మరింత భారాన్ని మోపుతుందని, డీజిల్, పెట్రోల్, గ్యాస్, మంచి నూనె ధరలు ఆకాశాన్ని అంటాయని చివరికి పేద ప్రజలు అనారోగ్యం వస్తే వాడే మందులు పారాసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి 850 రకాల మందుల ధరలను పెంచాలని చూస్తుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని వైద్యం, విద్య, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి పథకం వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా పేద ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు. కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని మళ్లీ బానిసలుగా చేస్తోందని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం. ఈ సమ్మెను చూసైనా కళ్ళు తెరిచి తమ విధానాలను మార్చుకోకపోతే రాబోవుకాలంలో పేద ప్రజలు కార్మికవర్గం ఈ పాలక వర్గాలపై తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ. నాయకులు ఎస్. తిరుపతి, క్రాంతి కుమార్, మండల కమిటీ నాయకులు. ఒద్ది రవీందర్, ఎస్ఎఫ్ఐ. బెల్లంపల్లి డివిజన్ నాయకులు. దాగం శ్రీకాంత్, మున్సిపల్ కార్మిక సంఘం. జిల్లా అధ్యక్షులు. ఎస్ కే. యాకుబ్, జిల్లా కమిటీ వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు కమల్, కార్యదర్శి పర్ల పెల్లి సుమన్, నాయకులు ఈర్ల రాజమొగిలి. బోళ్ల లక్ష్మీనారాయణ. జాంగిర్. రాంబాబు. సి హెచ్. స్వామి. వేణు. పవన్. శివ. సురేష్. విజయ్. నర్సరీ కార్మికులు. లతా. రేణుక. రామక్క. రాధక్క. చంటి. ఆశా వర్కర్స్. మాధవి. తదితరులు పాల్గొన్నారు.