గుండాల మార్చ్(28) రాయల్ పోస్ట్ ప్రతినిధి:
గుండాల నుండి గంగాపురం మీదుగా జనగాం సూర్యాపేట రోడ్డు వరకు ఉన్న బిటి రోడ్డు మరమ్మత్తుల కోసం గంగాపురం గ్రామస్తులు మండల ఎంపీడీవో గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పింగళి విజయ్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమస్యపై గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ గారికి పలుమార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం లేదని ఈ సమస్యను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి సురేష్ అల్వాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు