గుండాల మార్చ్(28) రాయల్ పోస్ట్ న్యూస్:-భూ పోరాట కమిటీ
మరిపడిగ గ్రామంలోని ఇండ్ల స్థలాలను వెంటనే లే అవుట్ చేయాలని సిపిఎం గుండాల మండల కార్యదర్శి మధ్దెపురం రాజు,భూ పోరాట కమిటీ అధ్యక్షుడు బండారు సుభాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలను వెంటనే లే అవుట్ చేయాలని కోరుతూ నిరసన తెలిపి డిప్యూటీ తహశీల్దార్ దాస శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరిపడిగ గ్రామ రెవిన్యూ శివారు 61,62,63,64 సర్వే నెంబర్లలో ఐదెకరాల భూమిని సుమారు
28 సంవత్సరాలు క్రితం అప్పటి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం జాలిగామ రంగనాయకమ్మ అనే రైతు వద్ద కొనుగోలు చేసి సుమారు 100 మందికి పైగా పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేసి లే అవుట్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎవరికి వారు ఇష్టారాజ్యంగా అక్రమ కబ్జాలు,నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు.స్థానిక ప్రజలు అనేక సంవత్సరాల నుండి పలుమార్లు వరుసగా ఎమ్మెల్యేలకు,జిల్లా కలెక్టర్లకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. వారం రోజుల్లో ఇండ్ల స్థలాలను లే అవుట్ చేసి అర్హులైన వారికి స్థలాలను అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఐక్యంగా సమరశీల పోరాటాలు నిర్వహించి లే అవుట్ సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఏప్రిల్ మొదటి వారంలోమండల తహశీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అనంతుల పెద్ద రామయ్య,సింగారం హన్మంతు, సొప్పరి యాదయ్య,శీల సోమరాజు,బొంగు రమేష్, అనంతుల గురుమూర్తి,బోయిని బక్కయ్య,వనం రాజు,జెటంగి శ్రీను పాల్గొన్నారు.