రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బద్రి వెంకటేష్ కారు అతని మోటార్ సైకిల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని టి యు డబ్లు ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ నాయకులు రుపిరెడ్డి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ బద్రి వెంకటేశ్ కారు ,మోటార్ సైకిల్ శనివారం గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి దగ్ధం చేసారని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను వెలికి తీసే జర్నలిస్ట్ కి ఇలాంటి ఘటన జరగడం బాధాకరం అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇలాంటి నేరానికి పాల్పడిన దుండగుల పై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలిపారు.ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్ట్ లకు ప్రభుత్వం రక్షణ కల్పించే దిశగా అడుగులు వేయాలని వారు కోరారు.